సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలి

 ఎంపీపీ బాలాజీ రావు


సుల్తానాబాద్,మే 12 (జనం గొంతు) : సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఎంపీపీ బాలాజీ రావు అన్నారు.శుక్రవారం సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శశికళ, తాసీల్దార్ యాకన్న, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్,అసిస్టెంట్ ఏఈ సతీష్ పీఈటీలతో కలిసి ఎంపీపీ బాలాజీ రావు సీఎం కప్ క్రీడా పోటీల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 17 వరకు సీఎం కప్ క్రీడా పోటీలను సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తామన్నారు.ఈ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్,ఖోఖో,అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు మండల పరిషత్ కార్యాలయంలో లేదా పీఈటీలు దాసరి రమేష్ 9490674874,మణిమాల 9963838448 నంబర్లను సంప్రదించి తమ పేర్లను అందించాలని కోరారు.అదేవిధంగా క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు,జిరాక్స్ కాపీ అందజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పీఈటీలు కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

కామెంట్‌లు