జనం గొంతు // ఓదెల //సతీష్ కుమార్
ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో బిరన్న ఉత్సవాలు శుక్రవారం రోజు ప్రారంభమయ్యాయి.తొలి రోజు ఉదయం గ్రామ దేవతలకు గంగాజలం తో అభిషేక కార్యక్రమం, మరియు పోచమ్మ బోనం బొడ్రాయి పూజించడం , పొలిమేర దేవతలను పూజించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో కురుమ డప్పులతో ఒగ్గు కళాకారులు విన్యాసాలు ప్రదర్శించారు .గొల్ల కులస్తులు, కురుమ కులస్తులు ,ప్రతి ఇంటి నుండి పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు