జనం గొంతు // ఓదెల// సతీష్ కుమార్
పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంపుల గ్రామంలో పోత్కపల్లి ఎస్సై రామకృష్ణ సీసీ కెమెరాలు, సైబర్ క్రైమ్ ,షీ టీం ,డయల్ 100, నకిలీ విత్తనాలు , గంజాయి మరియు మత్తు పదార్థాల, నియంత్రణ పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారూ
ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, ఎప్పటికప్పుడు వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లయితే వాటి నుంచి వారిని కాపాడవచ్చు అన్నారు. ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో గంజాయి లేదా మత్తు పదార్థాల వినియోగం అధికంగా కావడంతో నేడు ఈ సామాజిక సమస్యగా పరిగణించబడుతుంది ఇలాంటి సామాజిక సమస్యలన్నీ రూపుమాపడంలో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాల్సి ఉంటుందని ఇందులో భాగంగా ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, నకిలీ విత్తనాలు, రవాణా ఐడీ లిక్కర్ వినియోగం, ఇలాంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎవరైనా గమనిస్తే వెంటనే 100 నెంబర్ కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని కావున గంజాయి రహిత ప్రాంతంగా గుర్తింపు పడటం లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు
మహిళలపై నేరాలు మరియు సైబర్ క్రైమ్ వంటి నేరాలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని అలాగే ప్రతి గ్రామంలోని ఇంపార్టెంట్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎస్ ఐ సూచించడం జరిగింది.
గంజాయి లేదు మత్తు పదార్థాల విక్రయాలు నకిలీ విత్తనాలు రవాణా ఐడీ లిక్కర్ సరఫరా ఉత్పత్తి చేసిన వారిపై ఉక్కు పాదం మోపి వారి మీద సీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పోత్కాపల్లి ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పొత్కపల్లి ఎస్సై రామకృష్ణ గుంపుల గ్రామ సర్పంచ్ చిరంజీవి ఉపసర్పంచ్ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది గ్రామ యువత పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు