నాటు సారా తయారుచేసిన అమ్మిన,సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవు

 ఎక్సైజ్ సీఐ ఆనందరావు


సుల్తానాబాద్, మే 23 (జనం గొంతు) : నాటు సారాయి తయారుచేసిన అమ్మిన, సరఫరా చేసిన కఠినమైన చర్యలతో పాటు అవసరమైతే పిడియాక్ట్ నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ సిహెచ్ సాముల్ ఆనందరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాటు సారాయి తయారు చేస్తున్న కేసులో కాల్వ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సంపంగి రమేష్ ను కాల్వశ్రీరాంపూర్ తహసీల్దారు ముందు హాజరు పరచగా సంవత్సరం పాటు, ఒక లక్ష రూపాయల పూచికత్తుతో బైండోవర్ విధించగా, మళ్లీ నాటు సారా తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దారు ఎదుట హాజరు పరచగా అతనికి లక్ష రూపాయల జరిమానా విధించారు. అతడు లక్ష రూపాయల జరిమానా కట్టని సందర్భంలో జైలు శిక్ష విధించారు. సోమవారం ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసి కరీంనగర్ జైలు రిమాండ్ కు తరలించినట్లు సిఐ ఆనందరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కే సాయిబాబా,కానిస్టేబుల్స్ మనోహర్,సంపత్ పాల్గొన్నారు.

కామెంట్‌లు