ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్ఐ రామకృష్ణ


జనంగొంతు //ఓదెల //సతీష్ కుమార్

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సై రామకృష్ణ అగ్రికల్చర్ అధికారి ఏవో నాగార్జునతో కలిసి ఎరువు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు నిల్వ ఉంచిన విత్తనాలతో పాటు ప్యాకింగ్ తీరును పరిశీలించి విత్తనాల నిల్వ రికార్డును తనిఖీ చేశారు .రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని తక్కువ ధరకు లభిస్తుందని ఉద్దేశంతో ప్యాకింగ్ బార్ కోడింగ్ లేని అనుమానాస్పదంగా ఉండే విత్తనాలను కొనుగోలు చేసి నష్టపోవద్దని రైతులు  విత్తనాలు కొనుగోలు చేసే సందర్భంలో సదర్ కంపెనీలకు చెందిన విత్తనాలు నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయ అధికారికి సంప్రదించాలని నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోయే బదులు పంట సాగు ప్రారంభంలో నిపుణులు సంప్రదించి వారి సూచన ప్రకారం కొనుగోలు చేయాలని తెలిపారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు ,క్రిమి సంహారక మందులు ,విక్రయించే వ్యాపారులు మధ్య దళారీ ఏజెన్సీల, నిర్వాహకులపై వ్యాపారులపై, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ నకిలీ విత్తనాలు, ఎరువులు ,క్రిమిసంహారక మందులు, విక్రయించే వారి సమాచారం ఉంటే అందించాలని సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచి నగదు పారితోషకాన్ని అందిస్తామని తెలిపారు.

కామెంట్‌లు