పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు



 బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష

పెద్దపల్లి,మే 4 (జనం గొంతు) : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష అన్నారు.పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల భరోసా భద్రత ఉంటదనుకుంటే తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయిన నియమకాల కోసం ఇంకా కొట్లాడటమే సరిపోతుందని అన్నారు.2018 నోటిఫికేషన్ ద్వారా నెగటివ్ మార్కుల పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందిన వీళ్లకు మూడేళ్ల ప్రోబేషనరీ నడుస్తుండగా జీవో 26ను ఆమోదించి మరొక సంవత్సరం ప్రొబేషనరీ పీరియడ్ ను పెంచారు. కానీ రెగ్యులర్ చేయలేదు కావున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసి గడుస్తున్న ఐదేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ను సర్వీసులో  కలపాలన్నారు.జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, పట్టణ అధ్యక్షులు రమిళ్ళ శారద, పెద్దపల్లి మండల అధ్యక్షులు ఈదునూరి రాజబాబు, ఎండి అజీమ్, కరట్లపల్లి రజనీకాంత్, గుడికందుల సాయి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు