కాంట్రాక్టర్ విచిత్ర విన్యాసంతో కనగర్తి లో వింత రోడ్ నిర్మాణం,
నాణ్యమైన సిసి రోడ్ నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్.
జనంగొంతు// ఓదెల// సతీష్ కుమార్.
సాధారణంగా ఎక్కడైనా నూతన రోడ్ల నిర్మాణంలో ఆధునిక పోకడాలను అవలంబిస్తారు గతంలో ఉన్న దానికంటే మెరుగైన పద్ధతిలో రోడ్లను నిర్మిస్తారు వీలైతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోడ్లను మన్నికగా తీర్చిదిద్దుతారు అయితే అందుకు విరుద్ధంగా పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామం లో కాసులకు కక్కుర్తి పడి నా అధికారులు, కాంట్రాక్టర్ల ,కారణంగా విచిత్ర పద్ధతిలో రోడ్లను నిర్మిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గతంలో ఈ గ్రామంలో చెక్కుచెదరని సిసి రోడ్లు ఉండేవి, అయితే ఇసుక క్వారీల పుణ్యమా అని హెవిలోడితో లారీలు నిరంతరం ప్రయాణించడం కారణంగా రోడ్డు విద్వాంసమై గ్రామస్తులు అనేక ఇబ్బందులకు లోనయ్యారు. చివరికి రవాణా సైతం కష్టమైన స్థితిలో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు టీఎస్ఎండిసి అధికారులు తాత్కాలికంగా సుమారు పది లక్షల రూపాయలతో సిసి రోడ్డు పై సుమారు రెండు ఫీట్ల రెడ్ మిక్స్ కంకర వేసి రోడ్డుకు మరమ్మత్తులు చేసుకొని తమ పాని కానిచ్చుకపోయారు ప్రస్తుతం ఇసుక రవాణా నిలిచిపోయినప్పటికీ రోడ్డంతా చిందర వందరగా తయారై ప్రయాణికుల పాలిట నరకయాతనకు గురి చేస్తున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సందీట్లో సడే మియా లా ఈ రోడ్డుకు మంజూరైన నిధులతో పోచమ్మ దేవాలయం నుండి పిట్టల ఎల్లయ్య పల్లే పోయే దారి వరకు సుమారు 1.2 కిలోమీటర్ రహదారి నిర్మాణం విచిత్ర విన్యాసాలతో కొనసాగుతున్నది ధనసమైన పాత రోడ్డును తొలగించి నూతనంగా పక్కా ప్రణాళికతో నాణ్యమైన రోడ్డు నిర్మించాల్సి ఉండగా కాసులకు కక్కుర్తి పడిన అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నాసిరకం రోడ్డు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు గతంలో సిసి రోడ్డుపై టిఎస్ఎండిసి తాత్కాలికంగా పోసిన రెండు ఫీట్ల రెడ్ మిక్స్ ను అలాగే ఉంచి తూతూ మంత్రంగా ఆ రోడ్డుపై కాంక్రీట్ తో ఒక లేయర్ వేసి తారు రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు నిబంధనలకు త్రిలోదకాలు ఇచ్చి కాసులకు కక్కుర్తి పడిన అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించడంతో గ్రామస్తులు కొందరు కొందరు అయినా కనగార్తి మాజీ సర్పంచ్ ఆది మధుసూదన్ రావు
ప్రస్తుత వార్డ్ నెంబర్ తాళ్లపల్లి మల్లేష్
మరియు ఇట్యాల శ్రీనివాస్
జిల్లా కలెక్టర్ కు మరియు ఆర్ అండ్ బి ఈ ఈ గారికి మరియు విజిలెన్స్ కి ఫిర్యాదు చేశారూ ఇసుక క్వారీలు సృష్టించిన విధ్వంసానికి తాము పొందుతున్న ప్రతిఫలం ఇదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు గతంలో లాగా గ్రామంలో నాణ్యమైన సిసి రోడ్ల నిర్మాణం జరపాలని సీసీ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ప్రస్తుత రోడ్డు ఎత్తు కావడం వలన ఇండ్లలో నీరు బయట పోనీ పరిస్థితిలలో రోడ్డు మధ్యలో డ్రైనేజ్ పైప్ లైన్ వేయాలని ప్రస్తుతం తూతూ మంత్రంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి నాణ్యమైన సిసి కొరకు నూతన ఎస్టిమేట్లతో తమ.గ్రామానికి నాణ్యమైన సిసి రోడ్లు నిర్మించాల నీ గ్రామ ప్రజలు ఫిర్యాదారులు కోరుతున్నారు.