రాబోయే ఎన్నికలలో పద్మశాలిల సత్తా చాటుదాం


• ఘనంగా జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు*



సుల్తానాబాద్, జూన్ 03 (జనం గొంతు) : రాబోయే పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పద్మశాలీల సత్తా చాటుతామని  జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అయిల రమేష్ అన్నారు. శనివారం జూలపల్లి జెడ్పిటిసి, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మణ్ జన్మదినం  పురస్కరించుకొని పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు యాదగిరి ఆధ్వర్యంలో స్థానిక పూసాల రోడ్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక శాతం పద్మశాలీ ఓటర్లు ఉన్నారని,   పద్మశాలిలకు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. పద్మశాలి రాజకీయంగా ఎదగాలని, రాబోయే ఎన్నికలలో పద్మశాలీలు సత్తా చాటుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు వలస నిలయ, పద్మశాలి సంఘం నాయకులు గుండ మురళి,  అడేపు అంబదాస్, పెగడ పర్శరాములు, తుమ్మ శంకరయ్య,, సామల రాజేంద్రప్రసాద్, వల్స రాజమౌళి, సుంక మహేష్, కుర్మ శ్రీనివాస్, బొద్దుల వెంకన్న, ఎలిగేటి రమేష్, గుండా లక్ష్మీనారాయణ, అడెపు సదానందం తోపాటు పెద్ద సంఖ్యలో లక్ష్మణ్ అభిమానులు పాల్గొన్నారు.

కామెంట్‌లు